Vijayawada: ఈ పోటీల ద్వారా అమరావతి సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజెప్పాం: సీఎం చంద్రబాబు

  • ముగిసిన ఫార్ములా వన్ హెచ్ 2వో బోట్ రేసింగ్ పోటీలు
  • ప్రతి ఏటా ఇక్కడ పోటీలు నిర్వహించాలని కోరాను
  • జల క్రీడలకు ప్రకాశం బ్యారేజ్ అద్భుతమైన ప్రాంతం

విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ లో మూడు రోజుల పాటు నిర్వహించిన ఫార్ములా వన్ హెచ్ 2వో బోట్ రేసింగ్ పోటీలు ఈరోజుతో ముగిశాయి. ఈ పోటీలను తిలకించిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ, విజయవాడ వేదికగా అద్భుతమైన కార్యక్రమం జరిగిందని అన్నారు.

రాష్ట్ర పర్యాటక శాఖ ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషదాయకమని, ఈ పోటీల నిర్వహణ ద్వారా అమరావతి సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజెప్పామని అన్నారు. ఇకపై ఏటా ఇక్కడ పోటీలు నిర్వహించాలని ఫార్ములా వన్ సంస్థను కోరానని చెప్పారు. అద్భుతమైన నదీ తీరం, సుందరమైన ప్రకృతి మన సొంతమని, జల క్రీడలకు ప్రకాశం బ్యారేజ్ అద్భుతమైన ప్రాంతమని, ప్రతి నెలా ఈ ప్రాంతంలో ఏదో ఒక పోటీలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Vijayawada
Chandrababu
formula one racing
  • Loading...

More Telugu News