devineni uma: జగన్‌ అప్పుడే సీఎం అయిపోయినట్టు భ్రమిస్తున్నట్టున్నారు: మంత్రి దేవినేని ఉమ చురక

  • ముందు ఆ భ్రమ నుంచి ఆయన బయటకు రావాలి
  • బాధ్యతగా మాట్లాడితే బాగుంటుంది
  • ఎప్పుడో ఘటన జరిగితే ఇప్పుడా మాట్లాడేది

వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అప్పుడే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయినట్లు భ్రమిస్తున్నారని, అందుకే వివేకం, విచక్షణ లేకుండా విమర్శలు చేస్తున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విరుచుకుపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముందు ఆయన అటువంటి భ్రమల నుంచి బయటకు వచ్చి వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు.

తనపై హత్యాయత్నం జరిగిందని 23 రోజుల తర్వాత మాట్లాడుతున్న జగన్‌, ముఖ్యమంత్రి, డీజీపీలను ఏ1, ఏ2లుగా పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. జగన్‌ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని, అందుకే ఇటువంటి విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మాకు న్యాయం చేయండని మీ పార్టీ నేతలు ఢిల్లీకి వెళితే ‘ఇటువంటి పెట్టీ కేసు పట్టుకుని ఇక్కడకు రావాలా?’ అని అక్కడి వారు అన్న విషయం నిజమా? కాదా? అని ప్రశ్నించారు.

devineni uma
fires on jagan
  • Loading...

More Telugu News