Deepika Padukone: పెళ్లి తంతు ముగించుకుని ఇండియాలో కాలు పెట్టిన దీపిక, రణ్ వీర్!

  • ఈ ఉదయం ముంబైలో దిగిన దీప్ వీర్ జంట
  • చూసేందుకు పోటీ పడిన అభిమానులు
  • ఎయిర్ పోర్టు అధికారుల సెల్ఫీలు
  • దీపికకు అత్తవారింట ఘన స్వాగతం

ఇటలీలోని ఓ లగ్జరీ రిసార్టులో సింధి, కొంకణి సంప్రదాయాల్లో తమ వివాహాన్ని వైభవంగా జరుపుకున్న బాలీవుడ్ సెలబ్రిటీ జంట దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్ లు, ఈ ఉదయం ముంబై తిరిగి వచ్చారు. మిలన్ లో వారు ఎక్కిన విమానం ఉదయం 8 గంటల ప్రాంతంలో ముంబైలో ల్యాండ్ అయింది. సంప్రదాయ దుస్తులు ధరించి వచ్చిన వీరిని చూసేందుకు, ఫోటోలు తీసేందుకు ఇతర ప్రయాణికులు, అభిమానులు పోటీ పడ్డారు.

షేర్వాణీపై ఎరుపు రంగు జాకెట్ ధరించిన రణ్ వీర్, బంగారు వర్ణంలో ఉన్న సిల్క్ పంజాబీ సూట్ ను దీపిక ధరించి కనిపించారు. ఎయిర్ పోర్టు అధికారులు ఈ జంటతో సెల్ఫీలు దిగాలని కోరగా, వారు అంగీకరించి, కాసేపు సెల్ఫీలు దిగారు. ఈ జంట 14, 15 తేదీల్లో ఇటలీలోని లేక్ కోమోలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎయిర్ పోర్టులో దిగిన వీరు నేరుగా రణ్ వీర్ నివాసానికి వెళ్లగా, వీరికి సంప్రదాయ రీతిలో బంధుమిత్రులు స్వాగతం పలికారు.

Deepika Padukone
Ranveer Singh
Marriage
Mumbai
Airport
Italy
  • Loading...

More Telugu News