Kumaram Bheem Asifabad District: గురుకులంలో అగ్నిప్రమాదం... 40 మంది బాలికలకు తప్పిన ప్రమాదం

  • కాగజ్‌నగర్‌ వసతి గృహంలో ఘటన
  • తెల్లవారు జామున ఓ గదిలో చెలరేగిన మంటలు
  • మంటల్ని ఆర్పిన వసతి గృహం సిబ్బంది

నలభై మంది హాస్టల్‌ బాలికలకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. తెల్లవారు జామున అగ్నిప్రమాదం జరగగా, సిబ్బంది అప్రమత్తం కావడంతో సురక్షితంగా బయటపడ్డారు. కుమరంభీం అసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ బాలికల గురుకుల పాఠశాల వసతి గృహంలో చోటు చేసుకున్న ఈ సంఘటన చోటు చేసుకుంది. తెల్లవారు జామున హాస్టల్‌లోని ఓ గదిలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయానికి ఆ గదిలో మొత్తం 40 మంది విద్యార్థినులు నిద్రిస్తున్నారు. మంటల్ని గమనించిన హాస్టల్‌ సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటల్ని ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది.

Kumaram Bheem Asifabad District
kagaznagar
Fire Accident
  • Loading...

More Telugu News