Channai: చెన్నైకి తరలిస్తున్న వెయ్యి కిలోల శునక మాంసం పట్టివేత

  • ఎగ్మూరు రైల్వే స్టేషన్‌లో పట్టివేత
  • జోధ్‌పూర్ నుంచి సరఫరా
  • దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

బిర్యానీ తయారీలో పలు హోటళ్లు శునక మాంసాన్ని ఉపయోగిస్తున్నట్టు ఇటీవలి కాలంలో వార్తలు గుప్పుమన్నాయి. అందుకు ఊతమిచ్చే ఘటన చెన్నైలో వెలుగుచూసింది. రాజస్థాన్ నుంచి చెన్నైలోని హోటళ్లకు తరలిస్తున్న వెయ్యి కిలోల శునక మాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి ఐస్ బాక్స్‌లో పెట్టి తరలిస్తున్న మాంసాన్ని చెన్నైలోని ఎగ్మూరు రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐస్‌బాక్స్‌పై ఉన్న అడ్రస్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు మాంసాన్ని సరఫరా చేశారు? ఏయే హోటళ్లకు సప్లై చేశారు? అన్న దానిపై కూపీ లాగుతున్నారు.

Channai
Tamilnadu
Rajasthan
Dog mutton
Biryani
  • Loading...

More Telugu News