varavararao: నరేంద్ర మోదీ హత్యకు పన్నాగం కేసులో వరవరరావు అరెస్ట్... పుణెకు తరలింపు!

  • మోదీ హత్యకు కుట్ర పన్నినట్టు ఆరోపణలు
  • అరెస్ట్ అనంతరం గాంధీ ఆసుపత్రిలో పరీక్షలు
  • నేడు పుణె కోర్టుకు వరవరరావు

కోరేగావ్ అల్లర్ల కేసు, నరేంద్ర మోదీపై హత్యకు కుట్రపన్నారన్న ఆరోపణలపై విరసం నేత వరవరరావును పుణె పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న హైదరాబాద్ వచ్చిన మహారాష్ట్ర బృందం, ఆయన్ను అరెస్ట్ చేసి, వైద్య పరీక్షలు చేయించిన అనంతరం ఆయన్ను పుణెకు తరలించింది. నేడు ఆయన్ను అక్కడి కోర్టులో హాజరు పరచనున్నారు.

కాగా, ఇదే కేసులో గతంలో వరవరరావు అరెస్ట్ కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని మహారాష్ట్ర పోలీసులు ఆధారాలు సమర్పించడంతో, వారిని అరెస్ట్ చేయవచ్చని అత్యున్నత ధర్మాసనం ఇటీవల పేర్కొంది. దీంతో ఈ కేసులో ఒక్కొక్కరినీ అరెస్ట్ చేస్తున్న పోలీసులు, ఇప్పటికే అరుణ్ పెరీరా, వెర్నల్ గాన్స్ , సుధా భరధ్వాజ్, గౌతమ్ నవాల్కర్ లను అరెస్ట్ చేశారు.

varavararao
Arrest
Mumbai
Maharashtra
Police
Narendra Modi
  • Loading...

More Telugu News