nani: మరో మల్టీ స్టారర్ కి రెడీగా నాని .. దర్శకుడిగా ఇంద్రగంటి

  • మల్టీ స్టారర్ కథ రెడీ చేసిన ఇంద్రగంటి 
  • రెండవ హీరో కోసం అన్వేషణ 
  • నిర్మాతగా దిల్ రాజు      

నాని చేసిన మల్టీ స్టారర్ 'దేవదాస్' .. నటన పరంగా ఆయనకి మంచి మార్కులు తెచ్చిపెట్టింది. ఆ తరువాత సినిమాగా ప్రస్తుతం ఆయన 'జెర్సీ' చేస్తున్నాడు. క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే నాని మరో మల్టీ స్టారర్ చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నాడు.

దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ 'సమ్మోహనం' సక్సెస్ తరువాత మరో మంచి కథను సిద్ధం చేసుకున్నాడు. ఈ మల్టీ స్టారర్ కథ వినగానే వెంటనే నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. షూటింగ్ వెంటనే మొదలుపెట్టేస్తే, 'జెర్సీ'తో పాటు చేయడానికి కూడా ఓకే అన్నాడట. కానీ నాని స్థాయికి తగిన మరో హీరో ఎవరనే వెతుకులాటలో ఇంద్రగంటి వున్నాడట. మరో హీరో సెట్ కాగానే సెట్స్ పైకి వెళ్లడమే తరువాయి అని అంటున్నారు. దిల్ రాజు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడు.         

nani
indraganti
  • Error fetching data: Network response was not ok

More Telugu News