lalu prasad yadav: లాలూ ప్రసాద్ ఆరోగ్యం క్షీణించింది: ఆర్జేడీ

  • నిలబడలేకపోతున్నారు.. కూర్చోలేక పోతున్నారు
  • షుగర్ లెవెల్స్ పెరిగిపోయాయి
  • లాలూ ను కలసిన అనంతరం మీడియాతో రేఖాదేవి

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించిందని ఆ పార్టీ ఎమ్మెల్యే రేఖాదేవి తెలిపారు. ఆయన నిలబడలేకపోతున్నారు, కూర్చోలేకపోతున్నారని చెప్పారు. షుగర్ లెవెల్స్ పెరిగిపోయాయని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను ఇతర ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. రాంచీలోని రిమ్స్ ఆసుపత్రిలో ఈరోజు లాలూను రేఖాదేవి కలిశారు.

 అనంతరం మీడియాతో మాట్లాడుతూ, లాలూ ఆరోగ్యం పట్ల ఆందోళనను వెలిబుచ్చారు. దాణా కుంభకోణం కేసులో లాలూ జైలు శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన పెద్ద కుమారుడి వైవాహిక జీవితం ఆటుపోట్లకు గురవడం ఆయనను మరింత క్షోభకు గురి చేసింది. దీంతో, ఆయన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది.

lalu prasad yadav
health
dondition
serious
rekha devi
rjd
rims
  • Loading...

More Telugu News