somireddy chandramohanreddy: వైసీపీ ఇప్పటికైనా డ్రామాలు కట్టిపెట్టాలి: మంత్రి సోమిరెడ్డి

  • కత్తి కూడా ప్రభుత్వం తయారు చేయించిందనడం దారుణం
  • సమస్యలపై టీడీపీ కేంద్రంతో పోరాడుతోంది
  • వైసీపీ సొంత అజెండా అమల్లో బిజీగా ఉందని ఎద్దేవా

కోడి కత్తి ఘటనపై ఇప్పటికైనా వైసీపీ నాయకులు డ్రామాలు కట్టిపెట్టాలని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హితవు పలికారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై ఓ వైపు తెలుగుదేశం ప్రభుత్వం పోరాడుతుంటే వైసీపీ డ్రామాలాడుతూ సొంత అజెండా అమలు చేస్తోందని ధ్వజమెత్తారు. కత్తి కూడా ప్రభుత్వమే చేయించిందని వైసీపీ నేతలు ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. జగన్‌ సీఎం అయితేనే వైసీపీ నేతలు చట్ట సభలకు వెళ్లాలి, లేదంటే వెళ్ల కూడదా? అని ప్రశ్నించారు.

somireddy chandramohanreddy
fires on YSRCP
  • Loading...

More Telugu News