ys rajasekhara reddy: సూర్యాపేటలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన వైయస్ అభిమాని

  • ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద చోటు చేసుకున్న ఘటన
  • టీస్టాల్ లో వైయస్ ఫొటోను తొలగించిన టీఆర్ఎస్ నేతలు
  • మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించిన సాజిద్ ఖాన్

మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అభిమాని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. సూర్యాపేట పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సాజిద్ ఖాన్ అనే వ్యక్తి వైయస్ కు వీరాభిమాని. అక్కడ ఉన్న ఓ టీస్టాల్ లో వైయస్ ఫొటోను స్థానిక టీఆర్ఎస్ నేతలు తొలగించారు. దీంతో, తీవ్ర మనస్తాపానికి గురైన సాజిద్... ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్పందించిన స్థానికులు అతన్ని అడ్డుకున్నారు. దీంతో, పెను ప్రమాదం తప్పింది. 

ys rajasekhara reddy
fan
suicide attempt
suryapet
  • Loading...

More Telugu News