Ponnala Lakshmaiah: పొన్నాలకు సీటు దక్కేలా చూస్తానని హామీ ఇచ్చిన రాహుల్!

  • సీటు దక్కించుకోలేకపోయిన పొన్నాల, పొంగులేటి
  • రాహుల్‌కి సమస్యను వివరించిన నేతలు
  • తనకు వదిలేయాలని రాహుల్ సూచన

కాంగ్రెస్ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యల పేర్లు ఇంతవరకు ప్రకటించిన జాబితాలలో కనపడలేదు. వారి స్థానాలను పెండింగులో పెట్టారు. దీంతో వారు ఢిల్లీకి వెళ్లి అధినేత రాహుల్ గాంధీని కలిశారు. ఇరువురి సమస్యలనూ విన్న రాహుల్ సానుకూలంగా స్పందించారు. ‘మీ బాధ్యత నాకు వదిలేయండి’ అని రాహుల్ పొంగులేటికి తెలిపినట్టు తెలుస్తోంది.

తాను 35 ఏళ్లుగా జనగామకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని.. పొత్తుల కారణంగా తాను సీటు కోల్పోయానని రాహుల్‌కు పొన్నాల వివరించారు. జనగామకు సంబంధించి అన్ని విషయాలను కుంతియాకు వివరించాలని సూచించారు. జనగామ సమస్యను పరిష్కరించి పొన్నాలకు సీటు దక్కేలా చూస్తానని రాహుల్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోపక్క, పొత్తుల్లో భాగంగా జనగామ స్థానాన్ని టీజేఎస్‌కు కేటాయించినట్టు ప్రచారం జరుగుతోంది.

Ponnala Lakshmaiah
Ponguleti Sudhakar Reddy
Rahul Gandhi
Delhi
Janagoan
  • Loading...

More Telugu News