BLF: బీఎల్ఎఫ్ నుంచి సీటు సంపాదించుకున్న కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి

  • 16 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన బీఎల్ఎఫ్
  • కొత్తగూడెం నుంచి సీటు దక్కించుకున్న కృష్ణ
  • నాలుగో జాబితాను విడుదల చేసిన తమ్మినేని

ఎన్నికల రేసులో టికెట్ దక్కని అభ్యర్థులంతా ఇతర పార్టీలను ఆశ్రయిస్తున్నారు. కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి ఎడవల్లి కృష్ణ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్)లో సీటు సంపాదించుకున్నారు. నేడు బీఎల్‌ఎఫ్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రం తమ పార్టీ అభ్యర్థుల నాలుగో జాబితాను గురువారం విడుదల చేశారు. ఈ జాబితాలో బీసీలకు 5, ముస్లింలకు 5, ఎస్సీలకు మూడు, ఎస్టీలకు రెండు, ఎంబీసీలకు ఒకటి చొప్పున సీట్లను కేటాయించారు. మొత్తంగా నాలుగో జాబితాలో 16 మంది అభ్యర్థుల పేర్లను బీఎల్ఎఫ్ ప్రకటించింది.

BLF
Tammineni veerabhadram
Yedavalli Krishna
Kothagudem
  • Loading...

More Telugu News