Mala Lakhani: దేశ రాజధానిలో ఫ్యాషన్ డిజైనర్, సెక్యూరిటీ గార్డ్ హత్య!

  • మాలాను హత్య చేసిన రాహుల్ అన్వర్
  • పోలీసులకు సమాచారమిచ్చిన స్థానికులు
  • నేరాన్ని అంగీకరించిన రాహుల్

జీతం ఇవ్వలేదన్న కారణంగా యజమానిని దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం... ఢిల్లీలోని వసంత్‌కుంజ్ ఎన్‌క్లేవ్‌లో మాలా లఖినీ(53) అనే ఫ్యాషన్ డిజైనర్‌ నివసిస్తున్నారు. ఆమె వద్ద దర్జీగా పనిచేసే రాహుల్ అన్వర్ అనే వ్యక్తి తన స్నేహితులిద్దరితో కలిసి ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఆమె అరుపులు విని మాలా ఇంట్లోకి వచ్చిన సెక్యూరిటీ గార్డు బహదూర్‌ని కూడా హత్య చేశారు.

మాలా ఇంటి తలుపులు  తెరిచి ఉండటం, సెక్యూరిటీ గార్డు కూడా కనిపించకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.  వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మాలా, బహదూర్ హత్యకు గురైనట్టు గుర్తించారు. మాలా వద్ద పనిచేసే యువకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా రాహుల్ అన్వర్ నేరాన్ని అంగీకరించాడు. తనకు జీతం సరిగా ఇవ్వనందుకే మాలాను హత్య చేసినట్టు అతడు తెలిపాడు.

Mala Lakhani
Delhi
Police
Security Guard
Rahul Anwar
  • Loading...

More Telugu News