Telangana: తెలంగాణ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. స్థానికులకే టికెట్ ఇవ్వాలంటూ ఆందోళన!
- అలంపూర్ టికెట్ స్థానికులకే కేటాయించాలి
- హైదరాబాద్ లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయం వద్ద నిరసన
- జూబ్లీహిల్స్ టికెట్ తనకు కేటాయించమంటున్న నాయకుడు!
మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, టీడీపీల్లోనే కాకుండా టికెట్ల గొడవ బీజేపీలోనూ మొదలైంది. అలంపూర్ టికెట్ స్థానికులకే కేటాయించాలంటూ బీజేపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేకాకుండా, జూబ్లీహిల్స్ టికెట్ తనకు కేటాయించాలంటూ బీజేపీ నాయకుడు రామకృష్ణ నిరసన వ్యక్తం చేశారు.