Talasani: మంత్రి తలసాని ఆస్తుల వివరాలు ఇవే!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-0fa3e3bedc093904194e5e4ed4b0e64d2f7c7880.jpg)
- తలసాని పేరిట రూ. 12.66 కోట్ల స్థిర, చరాస్తులు
- కుటుంబ ఉమ్మడి స్థిర, చరాస్తులు రూ. 17.91 కోట్లు
- రెండు పోలీస్ స్టేషన్లలో మూడు కేసులు
టీఆర్ఎస్ సనత్ నగర్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ వేసిన సందర్భంగా... అఫిడవిట్ లో తనకు సంబంధించిన అన్ని వివరాలను వెల్లడించారు. తన స్థిర, చరాస్తులను రూ. 12.66 కోట్లుగా చూపించారు. భార్య పేరిట రూ. 9.77 కోట్లు ఉన్నాయని తెలిపారు. కుటుంబ ఉమ్మడి స్థిర, చరాస్తులు రూ. 17.91 కోట్లు ఉన్నాయని వెల్లడించారు. తనపై గాంధీనగర్, తుకారాంగేట్ పోలీస్ స్టేషన్లలో మూడు కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.