Sabita Indrareddy: కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో... అనుచరులతో సబితా ఇంద్రారెడ్డి కుమారుడి రహస్య మంతనాలు!

  • సబితా ఇంద్రారెడ్డికి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్
  • ఆమె కుమారుడికి మాత్రం మొండిచెయ్యి
  • రెబల్ గా బరిలోకి దిగే విషయమై అనుచరులతో చర్చిస్తున్న కార్తీక్ రెడ్డి

తాను ఆశించిన విధంగా మహాకూటమిలో టికెట్ పొందే అవకాశం లేదని స్పష్టం కావడంతో మనస్తాపంతో ఉన్న సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి, తదుపరి కార్యాచరణపై అనుచరులతో మంతనాలు ప్రారంభించారు. ఇప్పటికే సబితా ఇంద్రారెడ్డికి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్, ఆమె కుమారుడికి మాత్రం టికెట్ ఇచ్చేది లేదని చెప్పిన సంగతి తెలిసిందే.

ఉత్తమ్, కోమటిరెడ్డి తదితర నేతల కుటుంబాలకు ఒకటి కన్నా ఎక్కువ టికెట్లను ఇచ్చి, తమ కుటుంబానికి మాత్రం ఇవ్వక పోవడం ఏంటని ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలను నిలదీసిన కార్తీక్ రెడ్డి, ఇప్పుడు రెబల్ గా బరిలోకి దిగి సత్తా చూపించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

కాగా, కొన్ని సమీకరణాల వల్ల కార్తీక్ కు టికెట్ ఇవ్వలేకపోతున్నట్టు, ఇప్పటికే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కార్తీక్ రెడ్డి, తన అనుచరులతో రహస్య మంతనాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ రెబల్ గా బరిలోకి దిగితే, తన తల్లి విజయావకాశాలపై ప్రభావం ఏమైనా పడుతుందా? అన్న కోణంలోనూ వీరు చర్చిస్తున్నట్టు సమాచారం.

Sabita Indrareddy
Kartik Reddy
Telangana
Elections
  • Loading...

More Telugu News