Jagan: కోడికత్తి ఘటన ఓ హైలెవల్ డ్రామా.. నా ప్రమేయం నిరూపిస్తే ఉరేసుకుంటా: మంత్రి ఆదినారాయణ రెడ్డి

  • నిరూపించలేకపోతే వారికే శిక్ష విధించాలి
  • జగన్ మాటలు, దాడి ఘటన అంతా డ్రామా
  • ప్రజాకోర్టులో నిజాలు తెలుస్తాయి

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విశాఖపట్టణం విమానాశ్రయంలో జరిగిన కోడికత్తి దాడి ఘటన ఓ హైలెవల్ డ్రామా అని ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. జగన్ మాటలు, దాడి ఘటన అంతా డూప్ అని కొట్టి పడేశారు. ఈ దాడి వెనక తన హస్తం ఉందని నిరూపిస్తే ఉరేసుకుంటానని, నిరూపించలేకపోతే వైసీపీ నేతలకు ఏ శిక్ష విధించాలో వారే నిర్ణయించాలని సవాలు విసిరారు.

నిజానిజాలు ప్రజా కోర్టులోనే తెలుస్తాయన్న ఆయన ఈ కేసు విషయంలో ఏ ఆధారాలతో తనతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీజీపీలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. దాడి జరిగితే నవ్వుతూ విమానమెక్కి హైదరాబాద్ వెళ్లి ఆసుపత్రిలో చేరడం అంతా ఒక డ్రామాగా మంత్రి అభివర్ణించారు.

Jagan
YSRCP
Andhra Pradesh
Adinarayana Reddy
Kodikathi
  • Loading...

More Telugu News