kcr: కేసీఆర్ పాలనలో అభివృద్ధి కింద నుంచి కాకుండా పైనుంచి జరుగుతోంది: ప్రజా గాయకుడు గద్దర్

  • ఇచ్చిన హామీలను కేసీఆర్ నిలబెట్టుకోలేదు
  • పాలన సాగాల్సింది ప్రగతిభన్ నుంచి కాదు
  • తెలంగాణ తల్లికి మొక్కడం సరే, కేబినెట్ లో ఒక్క మహిళా లేరు!

సీఎం కేసీఆర్ పాలనపై ప్రజా గాయకుడు గద్దర్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాలనలో అభివృద్ధి కింద నుంచి కాకుండా పైనుంచి జరుగుతోందని వ్యంగ్యంగా అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, దళితులకు, నిరుద్యోగులకు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలను కేసీఆర్ నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. తెలంగాణ తల్లికి మొక్కడం, మహిళలను గౌరవిస్తానని చెప్పడం కాదు, కేసీఆర్ కేబినెట్ లో ఒక్క మహిళకైనా స్థానం కల్పించారా? అని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎటువంటి గుణాత్మకమైన మార్పులు జరగలేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పాలన అంటే సెక్రటేరియట్ నుంచి జరగాలి తప్ప, ప్రగతిభవన్ నుంచి కాదని విమర్శించారు. కేసీఆర్ ను కలిసేందుకు సెక్రటేరియట్ కు లేదా ప్రగతిభవన్ కు, ఫామ్ హౌస్ కు.. ఇలా ఎక్కడికి వెళ్లినా ఆయన కలవరని విమర్శించారు.

kcr
gaddar
Telangana
secretariat
  • Loading...

More Telugu News