Yogi Adityanath: కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించిన సీఎం యోగి ఆదిత్యనాథ్

  • సమాజాన్ని విభజించడం తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదు
  • అమరుల బలిదానాలను అవమానపరుస్తోంది
  • నక్సలిజం, టెర్రరిజం అవినీతిలను ప్రోత్సహిస్తోంది

కాంగ్రెస్ పార్టీపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ధ్వజమెత్తారు. అలాగే ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్ బబ్బర్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. నేడు ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ రెండవ విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

అనంతరం యోగి మాట్లాడుతూ.. సమాజాన్ని కులం, మతం, ప్రాంతం ఆధారంగా విభజించడం తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదని యోగి పేర్కొన్నారు. మావోయిస్టుల దాడుల్లో అమరులైనవారి బలిదానాలను కాంగ్రెస్ అవమానపరుస్తోందన్నారు. కాంగ్రెస్ గత 55 ఏళ్లుగా నక్సలిజం, టెర్రరిజం అవినీతిలను ప్రోత్సహిస్తోందన్నారు. అమరుల బలిదానాలను కాంగ్రెస్ అవమానపరుస్తోందన్నారు.

Yogi Adityanath
Uttar Pradesh
Chattisgarh Assembly
congress
  • Loading...

More Telugu News