gslv mark 3: జీఎస్ఎల్వీ మార్క్- 3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది: ఇస్రో చైర్మన్ శివన్

  • జీశాట్ సిరీస్ లో రెండో ప్రయోగం విజయవంతం
  • వాహక నౌక 16 నిమిషాల్లో కక్ష్యలోకి ప్రవేశపెట్టింది
  • జనవరిలో చంద్రయాన్ ప్రయోగం ఉంటుంది

జీఎస్ఎల్వీ మార్క్-3 డీ2 వాహక నౌక ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ కే శివన్ సంతోషం వ్యక్తం చేశారు. శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగం విజయవంతమైన అనంతరం శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, జీశాట్ సిరీస్ లో రెండో ప్రయోగం విజయవంతమైందని, భారత్ నుంచి ప్రయోగించిన భారీ ఉపగ్రహం జీశాట్-29 అని పేర్కొన్నారు. జీశాట్-29 ని వాహక నౌక 16 నిమిషాల్లో కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని అన్నారు. 2019 జనవరిలో చంద్రయాన్ ప్రయోగం ఉంటుందని ఈ సందర్భంగా శివన్ తెలిపారు.

కాగా, జీశాట్ సిరీస్ లో మూడు ఉపగ్రహాలను పంపాల్సి ఉండగా ఇప్పటికే రెండింటిని పంపారు. జీ శాట్-19 ఉపగ్రహాన్ని 2017లో పంపగా, జీ శాట్-29ను ఈ రోజు విజయవంతంగా ప్రయోగించారు. మరో ఉగపగ్రహం జీశాట్-11 ను డిసెంబర్ 4న యూరోపియన్ స్పేస్ పోర్టు నుంచి నింగిలోకి పంపనున్నారు.

  • Loading...

More Telugu News