sensex: ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ద్రవ్యోల్బణం ప్రభావం.. ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు

  • 2 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 6 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 10 శాతం వరకు లాభపడ్డ అదానీ ట్రాన్స్ మిషన్

పెరిగిన ద్రవ్యోల్బణం, ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రభావం మార్కెట్లపై పడింది. వీటి ప్రభావంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. దీంతో, ఈరోజు దేశీయ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 2 పాయింట్ల నష్టంతో 35,141కు చేరింది. నిఫ్టీ 6 పాయింట్లు కోల్పోయి 10,576 వద్ద స్థిరపడింది.

టాప్ గెయినర్స్:
అదానీ ట్రాన్స్ మిషన్ (9.99%), దిలీప్ బిల్డ్ కాన్ (9.65%), ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (7.67%), ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ (7.67%), ఫ్యూచర్ కన్జ్యూమర్ (7.10%).    

టాప్ లూజర్స్:
అశోక్ లేల్యాండ్ (-10.46%), మదర్సన్ సుమి సిస్టమ్స్ (-7.58%), సన్ ఫార్మా (-7.36%), దీపక్ ఫర్టిలైజర్స్ (-6.40%), డీఎల్ఎఫ్ (-5.24%).  

  • Loading...

More Telugu News