Samsung Galaxy S9: ఐస్ బ్లూ కలర్ వేరియంట్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్!

  • గతంలో పలు రంగులలో విడుదల 
  • ఈనెల 20 నుండి 'ఎస్9' ఐస్ బ్లూ రంగులో లభ్యం 
  • ఈనెల 26 నుండి 'ఎస్9 ప్లస్' ఐస్ బ్లూ రంగులో లభ్యం

శాంసంగ్ గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్ తాజాగా మరో కలర్ వేరియంట్లో వినియోగదారులకి అందుబాటులో ఉండనుంది. గతంలో విడుదలైన మిడ్‌ నైట్ బ్లాక్, టైటానియం గ్రే, కోరల్ బ్లూ, లైలాక్ పర్పుల్, సన్‌ రైజ్ గోల్డ్, బర్గండీ రెడ్ కలర్ వేరియెంట్లతో పాటు తాజాగా ఐస్ బ్లూ కలర్ వేరియంట్లో కూడా లభించనుంది. ఈనెల 20 నుండి ఎస్9, అలాగే 26వ తేదీ నుండి ఎస్9 ప్లస్ మోడళ్లు ఐస్ బ్లూ కలర్ వేరియంట్లో లభ్యం కానున్నాయి. గెలాక్సీ ఎస్9 ఫోన్ ధర సుమారుగా రూ. 57,000 ఉండగా, గెలాక్సీ ఎస్9 ప్లస్ ఫోన్ ధర సుమారుగా రూ. 67,400గా ఉండనుంది.

Samsung Galaxy S9
Samsung Galaxy S9+
smartphone
Tech-News
technology
  • Loading...

More Telugu News