Haryana: అక్రమ సంబంధం ఎఫెక్ట్.. ప్రియుడి చేత అతని భార్యను హత్య చేయించిన కిల్లర్ లేడీ!

  • హరియాణాలోని గురుగ్రామ్ లో ఘటన
  • ప్రమాదవశాత్తూ జరిగినట్లు కట్టుకథ
  • నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

వివాహితుడైన ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న యువతి అతడిని రహస్యంగా పెళ్లి చేసుకుంది. అక్కడితో ఆగకుండా సదరు వ్యక్తి చేత అతని మొదటి భార్యను హత్య చేయించింది. ఈ ఘటన హరియాణా రాష్ట్రంలోని గురుగ్రామ్ లో చోటుచేసుకుంది.

గురుగ్రామ్ లోని వ్యాలీ వ్యూ ఎస్టేట్ అపార్ట్ మెంట్ లో విక్రమ్ సింగ్ చౌహాన్, దీపిక దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అదే ప్రాంతంలో ఉంటున్న షెఫాలీ భాసిన్ తివారీ అనే మహిళతో విక్రమ్ కు పరిచయం ఏర్పడింది. అది కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. దీంతో వీరిద్దరూ ఆరు నెలల క్రితం రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఈ అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న దీపిక భర్తను నిలదీసింది. ఈ సందర్భంగా భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

దీంతో విక్రమ్ వెంటనే షెఫాలీకి మెసేజ్ పెట్టాడు. వెంటనే స్పందించిన ఆమె.. దీపికను వాళ్లు నివాసముంటున్న 8వ అంతస్తు నుంచి తోసేయాలని సూచించింది. ఆ సలహా నచ్చడంతో ముందువెనుక ఆలోచించకుండా దీపికను అపార్ట్ మెంట్ 8వ అంతస్తు నుంచి విక్రమ్ తోసేశాడు. ఈ ఘటనలో దీపిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం పోలీసులకు ఫోన్ చేసిన విక్రమ్ తన భార్య ప్రమాదవశాత్తూ బిల్డింగ్ నుంచి పడిపోయిందని చెప్పాడు.

అయితే విక్రమ్ ప్రవర్తనను అనుమానించిన పోలీసులు అతని కాల్ డేటా, మెసేజ్ ను పరిశీలించగా, షెఫాలీతో కలసి దీపిక హత్యకు కుట్ర పన్నినట్లు తేలింది. దీంతో ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Haryana
extra martial affair
husband killed wife
gurugram
Police
arrested
  • Loading...

More Telugu News