Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న రజనీకాంత్ రెండో కుమార్తె.. వ్యాపారవేత్త విశ్వగణ్‌తో సౌందర్య వివాహం

  • వచ్చే ఏడాది జనవరిలో వివాహం
  • నటుడు విశ్వగణ్‌కు కూడా ఇది రెండో వివాహమే
  • ప్రస్తుతం కుమారుడితో కలిసి ఒంటరిగా ఉంటున్న సౌందర్య

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య మరోమారు పెళ్లిపీటలు ఎక్కనున్నారు.  భర్త అశ్విన్ రామ్‌కుమార్‌‌తో మనస్పర్థల కారణంగా గతేడాది విడాకులిచ్చిన తర్వాత కుమారుడు వేద్ కృష్ణ (5)తో కలిసి ఒంటరిగా ఉంటున్న ఆమె త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నారు.

నటుడు, వ్యాపారవేత్త అయిన విశ్వగణ్ వనంగమూడితో మూడు ముళ్లు వేయించుకోబోతున్నట్టు కోలీవుడ్ సమాచారం. విశ్వగణ్‌కు కూడా ఇది రెండో వివాహమే కావడం గమనార్హం. విశ్వగణ్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీని నిర్వహిస్తున్నారు. వీరిద్దరి వివాహం వచ్చే ఏడాది జనవరిలో జరగనున్నట్టు తెలుస్తోంది.

గ్రాఫిక్ డిజైనర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన సౌందర్య దర్శకురాలిగా తండ్రి రజనీకాంత్-దీపిక పదుకునే పాత్రలతో దేశంలోనే తొలి మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ‘కొచాడియాన్’ అనే సినిమాను తీశారు. నిర్మాతగా ‘గోవా’ అనే సినిమాను నిర్మించారు.

Rajinikanth
Soundarya
Kollywood
  • Loading...

More Telugu News