White House: బేరమాడటంలో ఇండియా బెస్ట్: డొనాల్డ్ ట్రంప్

  • వైట్ హౌస్ లో దీపావళి వేడుకలు
  • భారత అమెరికన్లతో కలసి పాల్గొన్న ట్రంప్
  • నరేంద్ర మోదీ మంచి స్నేహితుడన్న అమెరికా అధ్యక్షుడు 

వాణిజ్య పరమైన సంబంధాలను తమకు లాభదాయకంగా మార్చుకోవడంలో ఇండియా అత్యుత్తమ పనితీరు కనబరుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. వైట్ హౌస్ లో భారత అమెరికన్లతో కలసి దీపావళి వేడుకలు జరుపుకున్న ఆయన, ప్రధాని నరేంద్ర మోదీతో తన స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు.

"ఇండియా, అమెరికాల మధ్య బలమైన సంబంధాలున్నాయి. మోదీ నాకు స్నేహితుడు కావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఇండియాతో మరింత దృఢమైన సంబంధాల కోసం కృషి చేస్తున్నాం. అయితే, వారు బేరం చేయడంలో సిద్ధహస్తులు. ఇంకా చెప్పాలంటే, ట్రేడ్ డీల్స్ ను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో బెస్ట్" అని అన్నారు. ఆపై వైట్ హౌస్ లోని రోస్ వెల్ట్ రూమ్ లో దీపాలను వెలిగించిన ట్రంప్, వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టాప్ ఇండియన్ అమెరికన్స్ పాల్గొన్నారు.



White House
Dewali
Donald Trump
India
USA
  • Loading...

More Telugu News