sandhya: హైకోర్టు ఉత్తర్వులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టు: సంధ్య

  • ధర్నా చౌక్ లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదు
  • నిరసన తెలపడం ప్రజల ప్రాథమిక హక్కు
  • ధర్నా చౌక్ వేదికగానే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొడతాం

తెలంగాణ ఉద్యమంలో హైదరాబాదులోని ధర్నా చౌక్ అత్యంత కీలకమైనదని... ధర్నా చౌక్ లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదని పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య అన్నారు. ధర్నా చౌక్ ను ఎత్తివేసి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేసిందని మండిపడ్డారు.

 నిరసన తెలిపే హక్కు లేకుంటే ప్రజాస్వామ్యానికి అర్థం లేదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రజల ప్రాథమిక హక్కు అని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సంతోషకరమని అన్నారు. హైకోర్టు ఉత్తర్వులు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటివని చెప్పారు. రానున్న ఎన్నికల్లో అన్ని పార్టీలు, వివిధ సంఘాలు కలసి ధర్నా చౌక్ వేదికగానే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొడతామని అన్నారు.

sandhya
pow
dharna chowk
TRS
  • Loading...

More Telugu News