Actress: లైంగిక ఆరోపణలపై వెనక్కి తగ్గిన నటి సంజన.. దర్శకుడు రవి శ్రీవాత్సవకు క్షమాపణ

  • గండ-హెండతి సినిమాలో తనను అసభ్యంగా చిత్రీకరించారని ఆరోపణ
  •  తన అవసరాన్ని వారికి అనుకూలంగా మార్చుకున్నారన్న సంజన
  • హెచ్చరించడంతో దిగి వచ్చిన వైనం

దర్శకుడు రవి శ్రీవాస్తవ తనను లైంగికంగా వేధించాడంటూ ఆరోపించి కలకలం రేపిన నటి సంజన గల్రాని మంగళవారం క్షమాపణలు చెప్పింది. అందరిలాగే ఎన్నో కలలతో రంగుల ప్రపంచంలో అడుగుపెట్టిన తాను తన మొదటి చిత్రం ‘గండ-హెండతి’ చిత్రీకరణ సమయంలో వేధింపులు ఎదుర్కొన్నానని ఆరోపించింది.

శాండల్‌వుడ్‌లో తనకు భయానక అనుభవాలు ఎదురయ్యాయని, ముద్దు సీన్లతోపాటు తన శరీరాన్ని అసభ్యంగా చిత్రీకరించారని వాపోయింది. ఎక్కడపడితే అక్కడ కెమెరాలు పెట్టి అసభ్యంగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేసింది. అందుకు తాను వ్యతిరేకిస్తే ఇండస్ట్రీలో భవిష్యత్తు లేకుండా చేస్తానని హెచ్చరించారని ఆరోపించింది. తాను చిన్న పిల్లని కావడంతో తన అవసరాన్ని వారు వాడుకున్నారని ఇటీవల సంచలన ఆరోపణలు చేసింది.

సంజన ఆరోపణలను దర్శకుల  సంఘం ఖండించింది. ఆమె అసత్య ఆరోపణలు చేస్తోందని పేర్కొంది. సంజన బేషరతుగా క్షమాపణలు చెప్పే వరకు కన్నడ సినిమాల్లో ఆమెకు అవకాశం కల్పించబోమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో దిగివచ్చిన సంజన దర్శకుడు శ్రీవాత్సవ, దర్శకుల సంఘం అధ్యక్షుడు నాగేంద్ర ప్రసాద్‌, సంఘం పథాధికారులకు ఆమె బేషరతుగా క్షమాపణ చెప్పింది.

Actress
Sanjana galrani
Sandalwood
Ravi srivatsava
Me too
  • Loading...

More Telugu News