Kala venkat Rao: వైసీపీ, జనసేన.. బీజేపీ కనుసన్నల్లోనే నడుస్తున్నాయి: కళా వెంకట్రావు

  • బాధితులను ఆదుకోవడంలో కేంద్రం విఫలం
  • జగన్, పవన్ ఎందుకు నోరు మెదపలేదు?
  • ఢిల్లీ నుంచే కోడికత్తి డ్రామాకు కథ, స్క్ర్రీన్‌ప్లే

తిత్లీ తుపాను కారణంగా శ్రీకాకుళం జిల్లా తీవ్రంగా నష్టపోయిందని.. బాధితులను ఆదుకోవడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని  ఏపీ టీడీపీ అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు విమర్శించారు. నేడు ఎచ్చెర్ల మండలం కొత్తపేటలో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తిత్లీ బాధితులకు కేంద్రం ఒక్క రూపాయి సాయం అందించకున్నా జగన్, పవన్ ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. వైసీపీ, జనసేన పార్టీలు బీజేపీ కనుసన్నల్లో నడుస్తున్నాయని కళా వెంకట్రావు విమర్శించారు. జగన్ కోడికత్తి డ్రామాకు కథ, స్క్రీన్‌ప్లే ఢిల్లీ నుంచే నడిచాయని ఆయన ఆరోపించారు.

Kala venkat Rao
Jagan
Pawan kalyan
Janasena
YSRCP
BJP
  • Loading...

More Telugu News