Chandrababu: సోనియాను దెయ్యం, అవినీతి అనకొండ అని తిట్టిన చంద్రబాబుతో పొత్తెలా పెట్టుకుంటారు?: కేటీఆర్

  • ముసలి నక్క, గుంటనక్క ఒక్కటయ్యాయి
  • కాళేశ్వరం ప్రాజెక్టును వేగంగా నిర్మిస్తున్నాం
  • పెన్షన్ తీసుకునే వయసును 58 ఏళ్లకు తగ్గిస్తాం

సోనియాను దెయ్యం, అవినీతి అనకొండ అని తిట్టిన టీడీపీ అధినేత చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తు ఎలా పెట్టుకుంటుందని టీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రశ్నించారు. సిరిసిల్ల నియోజకవర్గం, ముస్తాబాద్ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ముసలి నక్క కాంగ్రెస్, గుంటనక్క టీడీపీ ఒక్కటయ్యాయని విమర్శించారు.

ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలు కేసులు వేసినప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టును వేగంగా నిర్మిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ హయాంలో విత్తనాలు, ఎరువుల కోసం రైతులు క్యూలో నిలబడే పరిస్థితి ఉండేదని.. తమ ప్రభుత్వ హయాంలో అటువంటి పరిస్థితి ఎన్నడూ లేదన్నారు. పెన్షన్ తీసుకునే వయసును 58 ఏళ్లకు తగ్గిస్తామని.. మళ్లీ అధికారంలోకి రాగానే ఆసరా పెన్షన్‌ను రూ.2016కు పెంచుతామని కేటీఆర్ తెలిపారు.  

Chandrababu
Sirisilla
Sonia Gandhi
Kaleswaram Project
Congress
KTR
  • Loading...

More Telugu News