: ఒలింపిక్స్ నుంచి వైదొలగనున్న రెజ్లింగ్ !


2020లో జరగనున్న ఒలింపిక్స్ నుంచి రెజ్లింగ్ (మల్లయుద్ధం) ను తొలగించాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) ఎగ్జిక్యూటివ్ బోర్డు ఈ రోజు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రాచీన క్రీడ అయిన రెజ్లింగ్ ను ఒలింపిక్స్ నుంచి తప్పించడం అన్నది చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించే వార్త. దీని స్థానంలో ‘మోడరన్ పాంథలోన్’ అనే క్రీడను చేర్చాలని యోచిస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఒలింపిక్స్ లో 26 క్రీడలు ఉన్నాయి. అందులో ఒక దానిని తొలగించి వచ్చే సంవత్సరం నుంచి కొత్త దానిని చేర్చాలని ఒలింపిక్స్ కమిటీ భావిస్తోంది.

  • Loading...

More Telugu News