rahul gandhi: రాహుల్ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా, అందుకే, కాంగ్రెస్ పార్టీలో చేరానన్న యువతి!

  • రాహుల్ ని పెళ్లి చేసుకుంటానంటున్న మరో యువతి
  • ఆయన అంటే ఇష్టమన్న ఛత్తీస్ గఢ్ యువతి
  • ఛత్తీస్ గఢ్ లో విలేకరులకు చెప్పిన వైనం

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటానంటూ మరో మహిళ ముందుకొచ్చింది. ఛత్తీస్ గఢ్ కు చెందిన ఆ మహిళ అక్కడి పార్టీ కార్యాలయానికి వెళ్లి ‘కాంగ్రెస్’ లో చేరింది. ‘కాంగ్రెస్’లో చేరడానికి గల కారణమేంటి? అని సదరు మహిళను విలేకరులు ప్రశ్నించగా ఆమె చెప్పిన సమాధానం ఆశ్చర్యం కలిగించింది. రాహుల్ గాంధీ అంటే ఇష్టమని, ఆయన ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పింది.

కాగా, గతంలో కూడా ఇదే తరహా సంఘటన ఒకటి యూపీలో జరిగింది. రాహుల్ ను పెళ్లి చేసుకోవాలని ఉందని ఓ దళిత యువతి పేర్కొంది. దళితులకు రాహుల్ ఎంతో సాయం చేస్తారని, అందుకే, ఆయన్ని పెళ్లాడాలనుకుంటున్నానని ఆ యువతి చెప్పడం గుర్తుండే ఉంటుంది. ఇదిలా ఉండగా, ఛత్తీస్ గఢ్ లో తొలి విడత ఎన్నికలు నిన్న జరిగాయి. రెండో విడత ఎన్నికలు ఈ నెల 20 నుంచి జరగనున్న తరుణంలో ప్రచార కార్యక్రమాల్లో రాహుల్ బిజీగా ఉన్నారు.


rahul gandhi
chatisgarh
congress
lady
  • Error fetching data: Network response was not ok

More Telugu News