Ponnala Lakshmaiah: భువనగిరి నీదే... పార్లమెంట్ కు పంపుతాం: పొన్నాలకు అధిష్ఠానం హామీ

  • జనగామ టికెట్ ఆశించి భంగపడ్డ పొన్నాల
  • ఢిల్లీలో ఉత్తమ్ ను కలిసి చర్చలు
  • ఎంపీ సీటు ఇస్తామని హామీ

జనగామ అసెంబ్లీ టికెట్ ను ఆశించి భంగపడి, తాడో పేడో తేల్చుకోవాలని ఈ ఉదయం హస్తినకు చేరుకున్న పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఓ హామీ లభించింది. వచ్చే సంవత్సరం జరిగే లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేసే అవకాశాన్ని ఇస్తామని ఆ పార్టీ నేతలు పొన్నాలకు హామీ ఇచ్చారని సమాచారం.

కొద్దిసేపటి క్రితం ఉత్తమ్ కుమార్ ను పొన్నాల కలువగా, భువనగిరి ఎంపీ సీటు విషయమై రాహుల్ గాంధీతోనూ మాట్లాడానని, పొత్తుల కారణంగానే ఇలా చేయాల్సి వచ్చిందని నచ్చజెప్పినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఇక లోక్ సభ సీటు ఆఫర్ విషయమై పొన్నాల ఇంకా స్పందించలేదు.

Ponnala Lakshmaiah
Uttam Kumar Reddy
Rahul Gandhi
  • Loading...

More Telugu News