Harish Rao: మళ్లీ హరీశ్ రావు కారు తనిఖీ.. వారం వ్యవధిలో మూడు సార్లు!

  • గత వారంలో రెండు సార్లు తనిఖీ
  • నేడు ములుగు వద్ద పోలీసుల కంటబడిన హరీశ్ రావు వాహనం
  • తనిఖీ చేసి, ఏమీ లేదని తేల్చిన పోలీసులు

వారం రోజుల వ్యవధిలో టీఆర్ఎస్ నేత హరీశ్ రావు కారును పోలీసులు మూడోసారి తనిఖీ చేశారు. ములుగు ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా, హరీశ్ రావు ప్రయాణిస్తున్న వాహనం అదే రూట్లో వచ్చింది. తమ తనిఖీలకు సహకరించాలని పోలీసులు కోరడంతో, హరీశ్ రావు కారు దిగి, తనిఖీ చేసుకోవచ్చని చెప్పారు. దీంతో కారును క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు, అనుమానించదగ్గవేమీ అందులో లేవని నిర్ధారించి, ఆ వాహనం వెళ్లేందుకు అనుమతించారు. గత వారంలో హరీశ్ రావు కారును రెండుసార్లు తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే.

Harish Rao
Car
Telangana
Police
  • Loading...

More Telugu News