mithali raj: రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన మిథాలీ రాజ్

  • టీ20ల్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన మిథాలీ
  • 79 ఇన్నింగ్స్ లలో 2,232 పరుగులు
  • 80 ఇన్నింగ్స్ లలో 2,207 పరుగులు చేసిన రోహిత్ శర్మ

భారత మహిళ క్రికెటర్ మిథాలీ రాజ్ చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో భారత్ తరపున అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ గా రికార్డులకెక్కింది. మహిళల టీ20 ప్రపంచకప్ లో భాగం పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన మిథాలీ... 47 బంతుల్లో 56 పరుగులతో ఆకట్టుకుంది.

ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20ల్లో 2,232 పరుగులు (79 ఇన్నింగ్స్) చేసింది. పురుషుల క్రికెట్లో భారత్ తరపున రోహిత్ శర్మ టీ20ల్లో అత్యధిక పరుగులు చేశాడు. 80 ఇన్నింగ్స్ లలో రోహిత్ 2,207 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతని రికార్డును మిథాలీ అధిగమించింది.

mithali raj
t20
record
Rohit Sharma
  • Loading...

More Telugu News