Jagapatibabu: చంద్రబాబును కలిసిన నటుడు జగపతిబాబు!

  • ఈ ఉదయం అమరావతికి వచ్చిన జగపతిబాబు
  • చంద్రబాబుతో భేటీ
  • ఓ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు వచ్చిన జగపతి బాబు

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరోగా రాణించి, ఇప్పుడు ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ ను విజయవంతంగా నడిపిస్తున్న నటుడు జగపతిబాబు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని కలిశారు. ఈ ఉదయం అమరావతికి వచ్చిన ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారు.

తమ కుటుంబం ప్రారంభించనున్న ఓ వ్యాపార సంస్థ ప్రారంభోత్సవానికి చంద్రబాబును ఆహ్వానించేందుకు జగపతిబాబు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా, 'లెజండ్' సినిమాతో విలన్ గా సత్తా చాటి, ఆపై పలు సూపర్ హిట్ చిత్రాల్లో భాగమైన జగపతిబాబు, చిత్ర నిర్మాణం, ఆతిథ్య రంగం సహా పలు రకాల వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టివున్న సంగతి తెలిసిందే.

Jagapatibabu
Chandrababu
Amaravati
  • Loading...

More Telugu News