hollywood: థోర్, స్పైడర్ మ్యాన్ ల సృష్టికర్త స్టాన్ లీ కన్నుమూత!

  • న్యూయార్క్ లో తుదిశ్వాస విడిచిన దిగ్గజం
  • నివాళులు అర్పించిన మార్వెల్, వాల్ట్ డిస్నీ సంస్థలు
  • భార్య మరణంతో కుంగిపోయిన స్టాన్ లీ

ప్రఖ్యాత అమెరికా కామిక్ రచయిత, ఎడిటర్, పబ్లిషర్ స్టాన్ లీ(95) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన న్యూయార్క్ లోని తన నివాసంతో నిన్న అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. స్టాన్ లీ తొలిసారిగా 1961లో మార్వెల్ కామిక్స్ కోసం ‘ది ఫెంటాస్టిక్ ఫోర్’ పాత్రలను సృష్టించారు.

అంతేకాకుండా పిల్లలను విపరీతంగా అలరించిన స్పైడర్ మ్యాన్, ది హల్క్, ఎక్స్ మెన్, థోర్, ఐరన్ మెన్, అవెంజర్స్, బ్లాక్ పాంథర్, డాక్టర్ స్ట్రేంజ్, డేర్ డెవిల్, కెప్టెన్ అమెరికా వంటి పాత్రలు సైతం స్టాన్ లీ సృష్టించారు. ఈ పాత్రల ఆధారంగా మార్వెల్ సంస్థ పలు బ్లాక్ బస్టర్ సినిమాలను రూపొందించింది. 1939 డిసెంబర్‌ 28న జన్మించిన స్టాన్ లీకి ఫాదర్ ఆఫ్ పాప్ కల్చర్ గా పేరుంది.

గతేడాది ఆయన భార్య అనారోగ్యంతో కన్నుమూశారు. అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయిన స్టాన్ లీ అనారోగ్యం పాలయ్యారు. దీంతో లాజ్ఏంజెలిస్ లోని సినాయ్ మెడికల్ సెంటర్ లో ఆయన్ను చేర్పించారు. చివరికి కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కాగా, స్టాన్ లీ మృతిపట్ల  ప్రముఖ నిర్మాణ సంస్థలు మార్వెల్, వాల్ట్ డిస్నీలు సంతాపం తెలిపాయి.

  • Loading...

More Telugu News