Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల సూచన!

  • ఆదిలాబాద్ లో 9 డిగ్రీలు నమోదు
  • విశాఖ ఏజెన్సీలో దిగజారుతున్న ఉష్ణోగ్రతలు
  • హైదరాబాద్ లో ఈ సీజన్ లోనే అత్యల్ప ఉష్ణోగ్రత

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. హైదరాబాద్ లో నిన్న రాత్రి ఉష్ణోగ్రత కనిష్టంగా 14.8 డిగ్రీలకు పడిపోయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ సీజన్ లో నమోదయిన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదేనని వెల్లడించింది. ఇక ఆదిలాబాద్ లో 9 డిగ్రీలు, రామగుండంలో 16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయిందని పేర్కొంది.

అలాగే విశాఖ ఏజెన్సీలోనూ ప్రజలను చలిపులి భయపెడుతోంది. తాజాగా జి.మాడుగుల, జీకే వీధి, లంబసింగిలో ఉష్ణోగ్రతలు ఏకంగా 7 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో పాటు చింతపల్లిలో 9 డిగ్రీలు, మినుములూరులో 10 డిగ్రీలు, పాడేరులో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Hyderabad
Andhra Pradesh
Telangana
weather
falling tempature
Visakhapatnam District
Adilabad District
agency area
  • Loading...

More Telugu News