Andhra Pradesh: గురజాలలో టెన్షన్.. టెన్షన్.. వైసీపీ నేత కాసు మహేశ్ రెడ్డి హౌస్ అరెస్ట్!

  • అర్థరాత్రి వైసీపీ కార్యకర్తల అరెస్టులు
  • గురజాలలో నేడు ధర్నాకు పిలుపు
  • ఇంటిపన్ను పెంపుకు వ్యతిరేకంగా ఆందోళన

గుంటూరు జిల్లాలోని గురజాలలో ఈ రోజు ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పిడుగురాళ్ల మున్సిపాలిటి ఇటీవల ఇంటి పన్నులను పెంచడాన్ని నిరసిస్తూ, వైసీపీ నేతలు ఈ రోజు ఆందోళన నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఉదయాన్నే వైసీపీ గురజాల సమన్వయకర్త కాసు మహేశ్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

ఈ క్రమంలో పలువురు వైసీపీ కార్యకర్తలను పోలీసులు నిన్న అర్థరాత్రి నుంచే అరెస్ట్ చేయడం ప్రారంభించారు. కాగా, పోలీసుల చర్యపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. నిరసన తెలపడం అన్నది ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కు అనీ, దాన్ని కూడా టీడీపీ ప్రభుత్వం కాలరాస్తోందని వైసీపీ నేతలు మండిపడ్డారు. తాజాగా పన్నులు పెంచడంతో పాటు వేసిన రోడ్లకే మరోసారి టెండర్ పిలుస్తున్నారనీ, ఇదేంటని ప్రశ్నిస్తే అరెస్టులు చేయిస్తున్నారని వాపోయారు.

Andhra Pradesh
Guntur District
YSRCP
kasu mahesh
Police
house arrest
house tax
  • Loading...

More Telugu News