Ponnala Lakshmaiah: హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిన పొన్నాల లక్ష్మయ్య!

  • తొలి జాబితాలో కనిపించని పొన్నాల పేరు
  • జనగామ స్థానాన్ని ఆశిస్తున్న టీజేఎస్
  • ఢిల్లీ పెద్దలను కలవనున్న పొన్నాల లక్ష్మయ్య

కాంగ్రెస్ పార్టీ నిన్న అర్ధరాత్రి ప్రకటించిన తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో మనస్తాపానికి గురైన మాజీ మంత్రి, బీసీ నేత, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఈ ఉదయం హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో ఆయన కాంగ్రెస్ పెద్దలను కలిసి, తన పేరు ఎందుకు లేదో తెలుసుకోవాలన్న ఆలోచనతోనే వెళ్లినట్టు తెలుస్తోంది.

కాగా, ఆయన నియోజకవర్గమైన జనగామను టీజేఎస్ కోరుతోందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, జనగామ నుంచి పోటీ చేయాలని గట్టి పట్టుదలతో ఉండగా, మహా కూటమిలో భాగంగా ఆయనకు అవకాశం ఇచ్చేందుకే పొన్నాలకు సీటు కేటాయించలేదని తెలుస్తోంది. పొన్నాలకు ప్రస్తుతానికి సీటు ఇవ్వకున్నా, పార్టీలో ఆయనకు సముచిత స్థానం ఉంటుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

Ponnala Lakshmaiah
TJS
Congress
Maha Kutami
New Delhi
  • Error fetching data: Network response was not ok

More Telugu News