Nanda Gopal: లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన నందగోపాల్ కేసులో కీలక మలుపు!

  • నందగోపాల్ తండ్రి లాంటి వ్యక్తి అంటున్న విద్యార్థినులు
  • కేసు పెట్టిన అమ్మాయి లెస్బియన్ అని ఆరోపణ
  • చేతులు కోసుకుని మరీ విద్యార్థినుల నిరసన

తిరుపతి ప్రభుత్వ అనాథ బాలికల హాస్టల్ సూపరింటెండెంట్ నందగోపాల్ కేసు కీలక మలుపు తిరిగింది. నందగోపాల్‌పై తప్పుడు కేసు పెట్టారంటూ.. ఆ కేసును ఎత్తివేయాలని విద్యార్థినులు చేతులు కోసుకోవడంతో హాస్టల్ వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాలికలను లైంగికంగా వేధించాడని నందగోపాల్‌పై ఆరోపణలు రావడంతో పోలీసులు ఆయనపై పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేశారు.

అయితే, నందగోపాల్ తండ్రి లాంటి వ్యక్తి అని.. ఆయనపై కేసు పెట్టిన అమ్మాయి లెస్బియన్ అని హాస్టల్ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఆయన అరెస్టును నిరసిస్తూ కొందరు భవనంపైకి ఎక్కి ఆందోళన నిర్వహించగా.. మరికొందరు గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని చేతులు కోసుకుని మరీ నిరసన తెలియజేశారు. కోర్టులో జడ్జి ఎదుట నిజాలు వెల్లడిస్తామని.. కలెక్టర్ సత్వరమే స్పందించాలని విద్యార్థినులు కోరుతున్నారు.

Nanda Gopal
Tirupati
Hostel Students
District Collector
  • Loading...

More Telugu News