Durga Rao: యారాడ బీచ్‌లో గల్లంతైన ఆరుగురిలో ఒకరి మృతదేహం లభ్యం

  • నిన్న విహారయాత్రకని వెళ్లి గల్లంతైన యువకులు
  • దుర్గారావు మృతదేహం లభ్యం
  • గుండెలవిసేలా రోదిస్తున్న కుటుంబ సభ్యులు

నిన్న విహారయాత్రకని వెళ్లి యారాడ బీచ్‌లో గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నేటి సాయంత్రం ఆరుగురిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. గల్లంతైన వారిలో శ్రీనివాసరావు, దుర్గారావు, వాసు, రాజేశ్, తిరుపతి, గణేశ్ ఉన్నారు.

గల్లంతైన వారిలో దుర్గారావు మృతదేహం గంగవరం పోర్టు సమీపంలో లభ్యమైంది. ఇతని మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించేందుకు యారాడ బీచ్‌కు తరలించారు. వీరంతా 17-21 ఏళ్ల వారే.. వీరిలో ఒకరు విద్యార్థి కాగా మిగిలిన వారంతా వివిధ వృత్తుల్లో ఉన్నారు. రెండు హెలికాప్టర్లు, బోట్లతో అధికారులు, మత్స్య కారులు, నౌకాదళానికి చెందిన డైవర్లు వీరి కోసం గాలిస్తున్నారు. గల్లంతైన యువకుల కుటుంబీకులు యారాడ బీచ్ వద్దకు చేరుకుని గుండెలవిసేలా రోదిస్తున్నారు.

Durga Rao
Yarada Beach
Vasu
Rajesh
Ganesh
Tirupati
  • Loading...

More Telugu News