Ponguleti Sudhakar Reddy: పొత్తులపై కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆవేదన

  • సిట్టింగ్ స్థానాలు అడగటం అన్యాయం
  • పార్టీనే నమ్ముకున్న వారికి న్యాయం చేయాలి
  • సీనియర్లకు సీట్లు ఇవ్వకపోవడం దారుణం

పొత్తులపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సిట్టింగ్ స్థానాలను అడగటం, సీనియర్లకు సీట్లు ఇవ్వకపోవడాన్ని ఆయన నిరసించారు. మహాకూటమిలో పొత్తులపై విభేదాలు నెలకొన్న తరుణంలో ఆయన మాట్లాడుతూ, ఖమ్మం వంటి కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలను పొత్తుల పేరిట అడగటం అన్యాయమని పొంగులేటి సుధారకర్ రెడ్డి అన్నారు.

నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ పాలన పేరుతో కేసీఆర్‌పై విమర్శలు గుప్పిస్తున్న నేతలే తమ కుటుంబీకులకు సీట్లు అడగటం శోచనీయమన్నారు. ప్యారాచూట్ నేతలు, కాంట్రాక్టర్లకు సీట్ల కేటాయింపు విషయంలో రాహుల్ సరైన నిర్ణయం తీసుకుంటారని పొంగులేటి ఆశాభావం వ్యక్తం చేశారు. పొన్నాల వంటి సీనియర్లకు సీట్లు ఇవ్వకపోవడం దారుణమని.. పార్టీనే నమ్ముకున్న వారికి న్యాయం చేయాలని కోరారు.

Ponguleti Sudhakar Reddy
KCR
Khammam
Rahul Gandhi
Ponnala Lakshmaiah
  • Loading...

More Telugu News