congress: కాంగ్రెస్, టీడీపీతో కోదండరామ్ ఎలా పొత్తు పెట్టుకుంటారు?: మంత్రి హరీశ్ రావు

  • తెలంగాణ ఉద్యోగులను రాచి రంపానపెట్టిన పార్టీ కాంగ్రెస్
  • తెలంగాణ ద్రోహి తెలుగుదేశం పార్టీ
  • అటువంటి పార్టీలతో టీజేఎస్ కు పొత్తా?

తెలంగాణ అభివృద్ధికి పాటుపడని  కాంగ్రెస్, టీడీపీ లతో తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ ఎలా పొత్తు పెట్టుకుంటారని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఈ రోజు కొందరు టీజేఎస్ నేతలు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో హరీశ్ రావు మాట్లాడుతూ, నాడు తెలంగాణ ఉద్యోగులను రాచి రంపానపెట్టిన కాంగ్రెస్, తెలంగాణ ద్రోహి అయిన టీడీపీలతో కోదండరామ్ ఎలా పొత్తుపెట్టుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 నాడు ఉద్యమ సమయంలో ఉస్మానియా విద్యార్థులపై కాంగ్రెస్ పార్టీ కేసులు పెడితే, ఆ విద్యార్థులకు బెయిల్ ఇప్పించింది టీఆర్ఎస్ అని గుర్తుచేశారు. కాంగ్రెస్, టీడీపీలతో టీజేఎస్ పొత్తు పెట్టుకోవడాన్ని తెలంగాణ సమాజం హర్షించడం లేదని అభిప్రాయపడ్డారు. టీజేఎస్ ని వీడి టీఆర్ఎస్ లో చేరుతున్న నేతలు మంచి పని చేస్తున్నారని, వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. టీఆర్ఎస్ విజయానికి అందరం కష్టపడి పనిచేద్దామని, వంద సీట్లు సాధించి మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని అన్నారు.

  • Loading...

More Telugu News