Samsung W2019: శాంసంగ్ నుండి నూతన స్మార్ట్ ఫోన్.. ధర లక్ష పైనే!

  • 'శాంసంగ్ డబ్ల్యూ 2019' విడుదల 
  • రెండు డిస్ప్లే లతో లభ్యం  
  • ధర సుమారుగా రూ.1,04,450

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ల కంపెనీ శాంసంగ్ తాజాగా నూతన ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. 'శాంసంగ్ డబ్ల్యూ 2019' పేరిట విడుదలైన ఈ ఫోన్ కి వెనక భాగంలో రెండు కెమెరాలు, పక్క భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని ఏర్పాటు చేశారు. అలాగే 4.2 అంగుళాల స్క్రీన్ గల ఈ ఫోన్లో రెండు డిస్ప్లే లని ఏర్పాటు చేశారు. గతేడాది విడుదల చేసిన 'శాంసంగ్ డబ్ల్యూ 2018'కి మంచి ఆదరణ లభించడంతో ఈ ఏడాది 'డబ్ల్యూ 2019'ని సంస్థ విడుదల చేసింది. కాగా, పలు ఆకట్టుకునే ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ ధర మన దేశంలో సుమారుగా రూ.1,04,450గా ఉండనుంది.

'శాంసంగ్ డబ్ల్యూ 2019' ఫీచర్లు:

  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
  • 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
  • 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 6 జీబీ ర్యామ్, 128/256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • 4.2" సూపర్ అమోలెడ్ డ్యుయల్ డిస్ప్లే (1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్)
  • ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్
  • ఫింగర్ ప్రింట్ సెన్సార్

  • Error fetching data: Network response was not ok

More Telugu News