Marriage: పెళ్లి చేసుకోవడం, తర్వాత పారిపోవడం... బంగారం కోసం యువతి మాస్టర్ ప్లాన్!

  • పెళ్లయిన తరువాత అత్తింటికి వచ్చిన మౌనిక
  • పుట్టింటికి తీసుకెళతానన్న తండ్రి
  • 45 రోజులైనా రాకపోవడంతో భర్తకు అనుమానం
  • విస్తుపోయే నిజాలను వెలికితీసిన పోలీసులు

తమ కోడలిని ఆమె తండ్రి వచ్చి తీసుకెళ్లి 45 రోజులైనా, తిరిగి రాకపోవడం, వారి స్వగ్రామానికి చేరకపోవడంతో అనుమానం వచ్చిన అత్తింటి వారు చేసిన ఫిర్యాదుపై విచారించిన పోలీసులు విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, వైఎస్ఆర్ కడప జిల్లా ఖాజీపేట ప్రాంతానికి చెందిన భూమిరెడ్డి రామకృష్ణారెడ్డి అనే యువకునికి ప్రకాశం జిల్లా మోదినీపురంకు చెందిన మౌనికతో 3 నెలల క్రితం వివాహమైంది. వారిద్దరు అన్యోన్యంగానే ఉన్నారు.

ఇదిలా ఉండగా, మౌనిక  తండ్రి అనంత రెడ్డి  ఆగస్టు 25న ఖాజీపేటకు వచ్చి, తన కుమార్తెను పుట్టింటికి తీసుకెళ్లి తిరిగి తెస్తానని చెప్పడంతో, రామకృష్ణారెడ్డి స్వయంగా బస్టాండ్‌ కు వచ్చి బస్సు ఎక్కించాడు. ఆపై వారు ప్రకాశం జిల్లాకు వెళ్లలేదు, తిరిగి తన ఇంటికి రాలేదు. నెలన్నర తరువాత ఆందోళనతో రామకృష్ణారెడ్డి  పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసును పోలీసులు కూడా ఛాలెంజ్‌ గా తీసుకున్నారు.

విచారణ నిమిత్తం మౌనిక స్వగ్రామానికి వెళ్లగా, పోలీసులకు ఆశ్చర్యకర విషయాలు తెలిశాయి. మౌనిక గతంలోనూ కొందరిని వివాహం చేసుకుందని, ఆ తరువాత అత్తింటి నుంచి డబ్బు, బంగారంతో పరారైందని పోలీసులు తెలుసుకున్నారు. తమ బిడ్డ కనిపించక పోగా, మౌనిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయకపోవడం వారి అనుమానాలకు బలం చేకూర్చింది. తమది పేద కుటుంబమని, కట్న కానుకలు ఇవ్వలేమని చెప్పే మౌనిక తల్లిదండ్రులు, అత్తింటి వారితోనే బంగారం పెట్టించి, ఆపై ఉడాయిస్తుంటారని పోలీసులు భావిస్తున్నారు. మౌనిక వాడుతున్న ఫోన్‌ నంబర్ ఆధారంగా ఆచూకి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. 

  • Loading...

More Telugu News