Rahul Gandhi: ట్విట్టర్ సీఈఓతో సెల్ఫీ దిగిన రాహుల్ గాంధీ!

  • రాహుల్ ను కలిసిన జాక్ డోర్సీ
  • ఇద్దరి మధ్యా మాటా మంతీ
  • ట్విట్టర్ లో వెల్లడించిన రాహుల్

ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, ప్రస్తుతం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్న జాక్ డోర్సీతో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సెల్ఫీ దిగారు. ఈ ఉదయం జాక్, రాహుల్ ను కలవగా వారిద్దరి మధ్యా కాసేపు చర్చలు సాగాయి. ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించిన రాహుల్ గాంధీ, ప్రపంచవ్యాప్తంగా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడంలో ట్విట్టర్ దే ప్రముఖ పాత్రని వ్యాఖ్యానించారు. సమాచార బట్వాడా ఆరోగ్యకరంగా ఉండేందుకు, తప్పుడు వార్తలను అడ్డుకునేందుకు తీసుకుంటున్న చర్యల గురించి జాక్ తనకు వివరించారని రాహుల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తాను దిగిన సెల్ఫీలను రాహుల్ పోస్టు చేశారు.



Rahul Gandhi
Twitter
Jack Dorsey
Selfy
  • Error fetching data: Network response was not ok

More Telugu News