ntr: ఎన్టీఆర్ ..చరణ్ మూవీ యాక్షన్ ఎపిసోడ్ తోనే మొదలు

  • రాజమౌళి నుంచి మల్టీస్టారర్
  • పూర్తయిన భారీ సెట్ల నిర్మాణం  
  • 19 నుంచి రెగ్యులర్ షూటింగ్    

రాజమౌళి దర్శకత్వం వహించనున్న 'ఆర్ ఆర్ ఆర్' నిన్న పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా కనిపించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 19వ తేదీన మొదలుకానుంది. ఈ సినిమా కోసం ఇప్పటికే భారీ సెట్ల నిర్మాణం జరిగిపోయింది. తొలి షెడ్యూల్ లోనే ఎన్టీఆర్ .. చరణ్ లపై యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించనున్నారట.

దాంతో ఈ సినిమాలో ఎన్టీఆర్ .. చరణ్ ప్రత్యర్థులుగా కనిపించనున్నారనే ఊహాగానాలకు బలం చేకూరినట్టు అయింది. ఎన్టీఆర్ కండలు తిరిగిన దేహంతో కనిపిస్తాడట. ఇక చరణ్ లుక్ లో మాత్రం పెద్దగా మార్పు వుండదని అంటున్నారు. ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. తెలుగులో సాయి మాధవ్ బుర్రా .. తమిళంలో మదన్ కార్కి సంభాషణలను అందిస్తున్నారు.      

  • Loading...

More Telugu News