Pawan Kalyan: కొండంత చేయాల్సిన చోట గోరంతా?: చంద్రబాబుపై పవన్ కల్యాణ్ విమర్శలు
- తిత్లీ తుపాను బాధితులకు ఏ మాత్రం సాయం చేయలేదు
- ఎవరెస్టంత సాయం బాధితులకు కావాలి
- వేరుశనగ గింజంత చేసి పబ్లిసిటీయా?
- ట్విట్టర్ లో పవన్ కల్యాణ్ విమర్శలు
తెలుగుదేశం ప్రభుత్వం తిత్లీ తుపాను బాధితులకు ఏ మాత్రం సాయం చేయలేదని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఈ మేరకు నేడు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును పెట్టిన ఆయన, కొండంత సాయం చేయాల్సిన చోట గోరంత మాత్రమే చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు తన పబ్లిసిటీ కోసం బాధితులకు వేరుశనగ గింజంత సాయం చేశారని, ఇక్కడ వాళ్లకు ఎవరెస్ట్ పర్వతమంత సాయం కావాల్సి వుందని అన్నారు. ఈ సందర్భంగా అబ్రహాం లింకన్ చెప్పిన మాటలు తనకు గుర్తుకు వస్తున్నాయని చెప్పారు. ఏపీ ప్రభుత్వం తిత్లీ బాధితులను ఆదుకుంటోందన్న ప్రచార పోస్టర్ ను ఆతికించుకుని తిరుగుతున్న ఓ ఆర్టీసీ బస్సు ఫొటోను కూడా ఆయన పోస్ట్ చేశారు.
TDP Govt,help for Titli victims is peanuts,but publicity !! .. the size of an Everest!!!
— Pawan Kalyan (@PawanKalyan) November 12, 2018
This reminds me of a quote of Abraham Lincoln :” What kills a skunk is the publicity it gives itself”. pic.twitter.com/PJ6HYwz8xk