Tamilnadu: అమ్మాయి ప్రేమించడం లేదట... కత్తితో పొడిచేశాడు!

  • తమిళనాడు తిరునల్వేలి ప్రాంతంలో ఘటన
  • పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రియ
  • ప్రేమిస్తున్నానని వెంటపడ్డ కూలీ ఇసక్కి ముత్తు

తనను ప్రేమించడం లేదన్న ఆగ్రహంతో రెచ్చిపోయి, ఆమెపై కత్తితో దాడి చేశాడో ప్రేమోన్మాది. ఈ ఘటనలో అడ్డు వచ్చిన అమ్మాయి తమ్ముడిని కూడా వదల్లేదా దుర్మార్గుడు. తమిళనాడు పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, తిరునల్వేలి ప్రాంతానికి చెందిన ప్రియ (20) కాలేజీ చదువు తరువాత పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది.

అదే ప్రాంతానికి చెందిన ఇసక్కి ముత్తు అనే కూలీ పని చేసుకునే వ్యక్తి, ప్రియను ప్రేమిస్తున్నానని వెంటపడుతుండేవాడు. ఈ సంవత్సరం జనవరిలో అతనిపై ప్రియ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న ఇసక్కి ముత్తు, ఇటీవల తిరిగి వచ్చి మళ్లీ వేధింపులు ప్రారంభించాడు.

తెల్లవారుజామున ప్రియ తల్లి మాలతి పాలు తెచ్చుకునేందుకు బయటకు వెళ్లగా, ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న ప్రియను కత్తితో పొడిచాడు. ఆమె పెద్దగా అరవడంతో తమ్ముడు అడ్డురాగా, అతన్నీ పొడిచాడు. వీరి అరుపులకు స్థానికులు రావడంతో అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రగాయాల పాలైన వీరిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పారిపోయిన నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Tamilnadu
Crime News
Love
Knife
Police
  • Loading...

More Telugu News