Rajendra Nayak: చిన్న గొడవతో ప్రియుడిపై కక్ష పెంచుకున్న మహిళ.. అర్ధరాత్రి దారుణం!

  • చెన్నైలో ఉద్యోగం చేస్తున్న రాజేంద్ర నాయక్
  • స్వగ్రామంలో మహిళతో వివాహేతర సంబంధం
  • అర్ధరాత్రి రాజేంద్ర మర్మాంగాన్ని కోసేసిన మహిళ

మాటల సందర్భంలో జరిగిన చిన్న గొడవతో ప్రియుడిపై కక్ష పెంచుకున్న మహిళ అర్ధరాత్రి వేళ అతని మర్మాంగాన్ని కోసేసిన దారుణ ఘటన ఒడిశాలో జరిగింది. కియోంజర్ జిల్లా బదుగావ్‌‌ గ్రామానికి చెందిన రాజేంద్ర నాయక్(25)కు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఉద్యోగ రీత్యా చెన్నైలో ఉండే రాజేంద్ర సెలవుల్లో ఇంటికి వెళ్లినప్పుడల్లా ఆ మహిళతో గడిపేవాడు.

మంగళవారం స్వగ్రామానికి వెళ్లిన రాజేంద్ర.. బుధవారం ఆ మహిళ ఇంటికి వెళ్లాడు. మాటల సందర్భంలో సరదాగా జరిగిన గొడవతో ఆమె అతనిపై కక్ష పెంచుకుంది. అర్ధరాత్రి రాజేంద్ర గాఢ నిద్రలో ఉన్న సమయంలో పదునైన కత్తితో మర్మాంగాన్ని కోసేసింది. అతడి కేకలు విన్న స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. రాజేంద్ర ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.  

Rajendra Nayak
Odisha
Chennai
Knife
  • Loading...

More Telugu News